మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామంలో డీఎంహెచ్ ఓ ఆధ్వర్యంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద షుగర్, బీపీ ఉన్న వాళ్లకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ దరిచేరకుండా, ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఆస్పత్రికి వచ్చేవారు ఒకరికొకరు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఏఎన్ఎం అనురాధ, నవనీత, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?