ETV Bharat / state

బతుకు బండికే ఉరి... ఆశల పల్లకీనే వైకుంఠ రథమైంది! - driver suicide trolley auto

స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని.. కష్టాలని అధిగమించాలని కలలు కన్నాడు. కలలు సాకారం చేసుకోవడానికి.. అప్పు చేసి ఆటో ట్రాలీ కొన్నాడు. నడుపుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఓ దుర్మార్గుడి దుశ్చర్యను తట్టుకోలేపోయిన ఆ డ్రైవర్.. తన కలలను సాకారం చేసే ట్రాలీకే ఉరి వేసుకుని తనువు చాలించాడు. పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పి మరీ చనిపోయాడు. మెదక్ జిల్లాలో చోటుకుందీ హృదయవిదారక ఘటన.

man hang himself to trolley auto
man hang himself to trolley auto
author img

By

Published : Jun 18, 2020, 12:35 PM IST

మేడ్చల్ జిల్లా బహుదూర్‌పల్లికి చెందిన రామకృష్ణ డ్రైవర్‌గా చేస్తూ జీవనం సాగించేవాడు. ఎన్ని రోజులు పని చేసినా.. కష్టాలు తీరవన్న ఉద్దేశంతో.. పైనాన్స్‌లో ఆటో ట్రాలీ కోనుగోలు చేశాడు. రెండు నెలలకే కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చింది. అయినా రామకృష్ణ నిరాశ చెందలేదు. మంచి రోజుల కోసం ఎదురు చూశాడు. లాక్‌ డౌన్ అనంతరం తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు ట్రాలీలో వాటర్ బబుల్స్ లోడుతో వెళ్లాడు. అక్కడ వాటిని దించేసి.. వాటికి సంబంధించి సుమారు రూ.56వేలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. తూప్రాన్ సమీపంలోని టోల్ గేటు వద్దకు చేరుకునే సరికి బాగా రాత్రి అవడంతో అక్కడే నిద్రించాడు.

మరో మార్గం లేక

ఉదయం నిద్రలేచిన తర్వాత తన వద్ద ఉన్న డబ్బులను ఎవరో దొంగలించారని గుర్తించాడు. టోల్ సిబ్బంది వద్దకు వెళ్లి జరిగింది వివరించగా.. పోలీసులకు ఫిర్యాదు చేయమని వారు సూచించారు. 100కు ఫోన్ చేసిన రామకృష్ణ.. తన డబ్బులు పోయాయని... వాటిని యజమాని ఇవ్వడానికి తన వద్ద డబ్బులు లేవని.. తనకు మరో మార్గం లేక.. ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ట్రాలీకి తాడుతో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ వాహనంలోనే

స్థానిక పోలీసులు చేరుకునేలోపే రామకృష్ణ తుదిశ్వాస విడిచాడు. శవపరీక్షల కోసం మృతదేహాన్ని తూప్రాన్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కోటి ఆశలతో కొన్న వాహనంలోనే చివరికి అతని మృతదేహాన్ని తరలించడం అందరిని కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.