ETV Bharat / state

పోలీసులు కొట్టారని కరెంట్​ తీగలు పట్టుకున్నాడు.. చివరకు? - విద్యుత్​ తీగలు పట్టుకుని యువకుడు ఆత్మహత్య

Man died of holding electric wires in medak: ఖదీర్ ఖాన్ లాకప్ డెత్ జరిగి పది రోజులు గడవక ముందే.. మెదక్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కొట్టారన్న అవమానంతో ఓ యువకుడు వారి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంటు తీగలను పట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

committed suicide
ఆత్మహత్య
author img

By

Published : Feb 25, 2023, 10:03 AM IST

విద్యుత్​ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Man died of holding electric wires in medak: ఖదీర్​ ఖాన్​ లాకప్​ డెత్​ మరిచిపోకముందే.. అటువంటి ఘటన మెదక్ జిల్లా వెల్దురి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అదే ప్రాంతంలోని చిన్నశంకరం పేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లింగాపూర్ గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సాయిరాంను ఆపారు. ఈ క్రమంలో సాయిరాంకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఆగ్రహానికి గురైన పోలీసులు అందరి ముందే సాయిరాంను కొట్టారు. దీన్ని అవమానంగా భావించిన అతను సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఎక్కి తీగలను పట్టుకున్నాడు. అంతే కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. వెంటనే పోలీసులు తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

committed suicide
సాయిరాం

ఈ విషయంలో పోలీసుల తీరు అనుమానస్పదంగా ఉంది. ఈ ఘటన జరిగిన మూడు నాలుగు గంటల తర్వాతే సాయిరాం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అతని మృతదేహాన్ని వెంటనే చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. సాయిరాం మృతదేహాన్ని చూపించి వెంటనే వారిని తూప్రాన్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ వారితో ఎవరూ మాట్లాడకుండా.. ఎవరినీ కలవనీయకుండా కానిస్టేబుల్​ను కాపలా ఉంచారు.

Man Committed Suicide In Medak: సాయిరాం ఆత్మహత్యపై పోలీసులు ప్రకటన కానీ.. వివరణ కానీ ఇవ్వకపోవడం గమనార్హం. స్థానిక రాజకీయ నాయకుల సాయంతో పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతని తల్లిదండ్రులను ఒప్పించి బలహీనమైన కేసు పెట్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తూప్రాన్​ పోలీసుల తీరు మొదటి నుంచి వివాదస్పదంగానే ఉంటోంది. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు.. మామూళ్ల మత్తులో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సాయిరాం ఆత్మహత్య ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఉన్నతాధికారులు తూప్రాన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.