మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కిరాణ దుకాణాలు, పెట్రోల్ బంకులు, అత్యవసర ప్రభుత్వ కార్యాలయాలు, కూరగాయల దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి.
మున్సిపల్ సిబ్బంది విధుల్లో పాల్గొని వీధులను శుభ్రం చేశారు. పోలీసులు వీధుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి : రైతు బజార్లు కిటకిట... ధరలు భగభగ