మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన చింతకాడి సత్తయ్య గొర్రెల మందపై దాడి చేసి.. ఓ గొర్రెను నోట కరుచుకొని పారిపోవడానికి ప్రయత్నించింది. అప్రమత్తమైన సత్తయ్య.. రాళ్లు విసరగా.. అక్కడి నుంచి పారిపోయింది.
అనంతరం అదే గ్రామానికి చెందిన దుబ్బ ఎల్లయ్య పొలం వద్ద కట్టేసి ఉన్న దూడపై దాడి చేసి చంపేసింది. కొద్దిదూరం లాక్కెళ్లి తినేసింది. మిగతా కళేబరం అక్కడే వదిలేసి పారిపోయింది. చిరుత సంచారం గురించి తెలుసుకున్న గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మండలంలో పలుచోట్ల పశువులు, రైతులపై దాడులు చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోకి ప్రవేశిస్తుందేమో అని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఇవీచూడండి: కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ఉత్తమ్