ETV Bharat / state

సమష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం: సీఎం

author img

By

Published : Jun 25, 2020, 1:56 PM IST

Updated : Jun 25, 2020, 4:46 PM IST

మెదక్ జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్... సమష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం వచ్చిందని అన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారని గుర్తు చేశారు. తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు.. డబ్బులు ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు.

KCR TALK ABOUT HARITHAHARAM IN NARSAPUR MEDAK DISTRICT
సమష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం: సీఎం

స్వయంగా కారు నడుపుతూ ఈ అడవుల్లో తిరిగానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సాపూర్‌ నుంచి సంగారెడ్డి, తుప్రాన్‌, హైదరాబాద్‌కు ఫియెట్‌ కారులో తిరిగానని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సినిమా షూటింగ్‌ల కోసం నర్సాపూర్‌ అటవీప్రాంతాన్నే ఎంపిక చేసుకునేవారని అన్నారు. ఈ అడవుల్లో చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయని వివరించారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమే..

సమష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం వచ్చిందని తెలిపారు. తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు.. డబ్బులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ కచ్చితంగా 100 శాతం ధనిక రాష్ట్రమేనని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల ఆదాయం లేకపోవడం వల్ల సగం వేతనాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు.

ఎక్కడైనా ఖాళీ బిందెల ప్రదర్శనలు కనిపించాయా..?

మన అధికారం మన చేతుల్లో ఉంటే ఈరోజు వచ్చిన ఫలితంలా ఉంటుందని సీఎం అన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయని ఎవరూ నమ్మలేదని... ఇప్పుడు దానితోనే తాగునీటి సమస్యను తీర్చామని వివరించారు. రాష్ట్రంలో ఖాళీ బిందెల ప్రదర్శనలు లేవని అన్నారు. విద్యుత్‌ సమస్యను అధిగమించామని అభిప్రాయపడ్డారు. ఇకముందు తెలంగాణకు విద్యుత్‌ సమస్యరాదని సీఎం భరోసానిచ్చారు.

ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

Last Updated : Jun 25, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.