కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా కేంద్రం ఎంపిక చేసిన మండలాల్లో మెదక్ జిల్లా నిజాంపేట్ ఉండటం ఆనందంగా ఉందని మండల వాసులు చెబుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి గాయత్రీ మిశ్రా.. వారి బృందంతో కలిసి గత మూడ్రోజులుగా మండలంలో పర్యటించారు. ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టరేట్లో అధికారులకు జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. నిజాంపేటలో మొత్తం 14 గ్రామాలు, 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటినీ పర్యటించిన మిశ్రా బృందం... ప్రజలందరికీ ఈ కార్యక్రమం గురించి వివరించారు. హరితహారంలో భాగంగా 10 లక్షల మొక్కలు నాటపోతున్నామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు చెప్పారు. జల శక్తి అభియాన్ ద్వారా మూడు నెలల్లో ఈ పథకాలను అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు