మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పంట నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. పంట చేతికందే సమయంలో దెబ్బతినడం వల్ల అన్నదాతకు పెట్టుబడి కూడా రాక కన్నీటిపర్యంతమవుతున్నాడు.
మెదక్ జిల్లాలో లక్షా 90 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ అన్నారు. పత్తి 80 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 33 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.
నష్టానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో సర్వే నెంబర్ల వారిగా జాబితాను తయారుచేసి పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు.
ఇవీచూడండి: ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్