ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమం విజయవంతానికి మెదక్ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఆర్డీఎకు 38 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించారని డీఆర్డీఏ శ్రీనివాస్ తెలిపారు. మొక్కలు నాటేందుకు తమ శాఖ ద్వారా ఐదు లక్షల దాకా గుంతలు తీశామన్నారు. హరితహారం ప్రారంభమయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
జిల్లాలోని కొల్చారం మండలం నాయి జలాల్ పూర్ గ్రామ పంచాయతీకి 9600 మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించగా... అందుకనుగుణంగా మొక్కలు తక్కువగా ఉన్న అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు. నేటివరకు మూడు వేల గుంతులను తీసినట్లు పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 'ధూర్త శక్తి''