మెదక్ జిల్లా కేంద్రం నుంచి మక్త భూపతిపూర్ వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా నాలుగు వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మార్వో రవికుమార్, ఆర్డీఓ సాయిరాం, జూనియర్ కళాశాలల విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, లెక్చరర్స్, పాల్గొన్నారు. జిల్లాకు మూడు కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 లక్షలకు పైనే మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈసారి ప్రత్యేకంగా ఏవెన్యూ ప్లాంటేషన్ రోడ్లకు ఇరువైపులా, ఫారెస్ట్‌లో పండ్ల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ప్రతి గ్రామ పంచాయతీకి సుమారుగా 50 నుంచి 100 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ కేటాయించడం జరిగిందని వివరించారు.
ఇదీ చూడండి : 'రాష్ట్ర ఖజనా రెండింతలయితే ఇన్ని బకాయిలు ఎలా వచ్చాయి?'