మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏడుపాయలలో జరిగే జాతర కోసం నిధులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోటి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు.
అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయల వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.31 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడుపాయలలో ఔట్ పోస్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు.
జాతరకు వచ్చే భక్తుల స్నానాలకు ఇబ్బంది తలెత్తకుండా సింగూరు నుంచి నీళ్లు విడుదల చేస్తామని పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జాతర ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం మహాశివరాత్రి జాతరకు సంబంధించిన గోడ పత్రికను ఆలయ ఈవో సార శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
![Funds released for edupayala jathara in medak district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10826228_nll.jpg)