సిర్పూర్ కాగజ్‌నగర్ సారసాలలో అటవీ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా మెదక్‌లో అటవీశాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డివిజన్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసిన అధికారులు... అనంతరం జాయింట్ కలెక్టర్ నగేష్‌కు వినతి పత్రం అందజేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారిణిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగిన జడ్పీ వైస్ ఛైర్మన్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు. ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలతో అధికారుల మనోధైర్యం దెబ్బతిని విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: మళ్లీ నేను పుట్టాలని.. దయచేసి కోరుకోకమ్మా!