ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రతి ఆదివారం ఎడ్యుకేషనల్ సండే, సండే స్కూల్ సండే, వికలాంగుల సండే, వృద్ధుల సండే అని ఇలా అనేక వినూత్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా సంవత్సరంలో చివరి ఆదివారమైన నేడు ఫ్యామిలీ సండేగా నిర్వహించారు. క్రైస్తవులు కుటుంబ సమేతంగా పాల్గొని పార్థనలు చేస్తూ.. దేవుని ఆరాధించారు.
ప్రతి సంవత్సరంలో చివరి ఆదివారం కుటుంబ ఆదివారంగా నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతుందని ప్రెస్ బీటర్ ఇన్ఛార్జీ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ పేర్కొన్నారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను సర్దుబాటు చేసుకుని.. నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఇలా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు