ETV Bharat / state

'గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని లాక్కోవాలని చూస్తున్నారు' - dharmathanda news

గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ఆరోపించారు. భయబ్రాంతులకు గురిచేసి పంటలను ధ్వంసం చేశారన్నారు. పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

ex mlc ramulu nayak on tribal lands
ex mlc ramulu nayak on tribal lands
author img

By

Published : Aug 29, 2020, 7:14 AM IST

రాష్ట్రంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని మాజీ ఎమ్మెల్సీ, గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నాయక్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసుస్టేషన్​లో గిరిజనులపై అటవీశాఖ అదికారులు ఫిర్యాదు చేసిన వివరాలను, సంబంధించిన పత్రాలను తీసుకున్నారు.

ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు అడవుల్లో సాగు చేసే గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాములు నాయక్​ తెలిపారు. నర్సాపూర్ ధర్మాతండాలో ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములను ఇప్పుడు వారివి కాదంటున్నారని వివరించారు. ధ్వంసం చేసిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి : కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.