ETV Bharat / state

రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​గా సునీతా లక్ష్మారెడ్డి

రాష్ట్ర మహిళా కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమించింది. కమిషన్​ సభ్యులుగా షాహీనా అఫ్రోజ్‌, ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతిరావు నియామకం అయ్యారు.

రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్మన్​గా సునీతా లక్ష్మారెడ్డి

author img

By

Published : Dec 28, 2020, 6:31 AM IST

Updated : Dec 28, 2020, 7:35 AM IST

తెలంగాణ తొలి మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతాలక్ష్మారెడ్డిని నియమించింది. సభ్యురాళ్లుగా గద్దల పద్మ(వరంగల్‌ జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌), షాహీనా అఫ్రోజ్‌(హైదరాబాద్‌, మహబూబ్‌గంజ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్‌పర్సన్‌), కుమ్ర ఈశ్వరీబాయి(ఇంద్రవెల్లి మాజీ ఎంపీపీ), కొమ్ము ఉమాదేవియాదవ్‌ (మంచిర్యాల), సూదం లక్ష్మి (నిజామాబాద్‌), కటారి రేవతిరావు (పెద్దపల్లి)లు నియమితులయ్యారు. అయిదేళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారు.

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉమ్మడి కమిషనే మూడేళ్లపాటు కొనసాగింది. తాజాగా మొదటి కమిషన్‌ నియామకం జరిగింది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన సునీత (52)ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పదవికి ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009లలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళాశిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతిపథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె 2019 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేశారు. తాజాగా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కోసం వివిధ పేర్లను పరిశీలించిన సీఎం అనుభవం దృష్ట్యా ఆమెను ఎంపిక చేశారు. సభ్యురాళ్లుగా జిల్లాల్లో మహిళల సేవకు కృషి చేసిన ఆరుగురికి అవకాశం ఇచ్చారు.

అప్పుడు మంత్రిగా... ఇప్పుడు ఛైర్‌పర్సన్‌గా

2010 నుంచి 2014 ఏప్రిల్‌ వరకు సునీత స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. మహిళా కమిషన్‌ ఈ శాఖ పరిధిలోనిదే. ఇప్పుడు ఆమె ఆ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

మిగిలిన కమిషన్ల నియామకాలపై సీఎం దృష్టి

రాష్ట్రంలో మహిళా కమిషన్‌ నియామకం అనంతరం ఇతర కమిషన్ల పదవుల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. వెనకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు, సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌, మరికొందరు సభ్యులు, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, ఇతర సభ్యుల నియామకాలను ఆయన త్వరలో చేపట్టనున్నారని తెలిసింది.

అతివలకు సంపూర్ణ న్యాయం

తెలంగాణ మహిళా కమిషన్‌ మొట్టమొదటి ఛైర్‌పర్సన్‌గా నియమితులవడం తన అదృష్టమని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. మహిళలకు సంపూర్ణ న్యాయం చేస్తానని, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని వివరించారు. నియామకం అనంతరం ఆమె ‘ఈటీవీ భారత్​’తో మాట్లాడారు. ‘‘నన్ను ఎంపిక చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో చెప్పారు. ఎంతో కీలకమైన పదవిని ఇస్తున్నట్లు వెల్లడించారు. చట్టబద్ధమైన కమిషన్‌ పదవి ఎంతో బాధ్యతలతో కూడుకున్నది. దానిని సమర్థంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’నని ఆమె అన్నారు.

త్వరలోనే బాధ్యతలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళా కమిషన్‌ నియామకం ద్వారా మహిళలకు మరింత భరోసా లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి, త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. సభ్యురాళ్లు, తాను సమన్వయంతో ముందుకు సాగుతూ కమిషన్‌కు, తెలంగాణకు పేరు తెస్తామన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​గా సునీతా లక్ష్మారెడ్డి

ఇదీ చూడండి: కాసుల వర్షం కురిపిస్తోన్న పాత పద్ధతి..

Last Updated : Dec 28, 2020, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.