ETV Bharat / state

edupayala Vanadurgamma Temple : పదిరోజులుగా జలదిగ్బంధంలోనే వనదుర్గమ్మ - తెలంగాణలో వరదలు

మెదక్​ జిల్లాలోని ఏడుపాయల వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సింగూర్​ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉద్ధృతితో పది రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి ఆలయం (edupayala Vanadurgamma Temple) జగదిగ్బంధంలోనే చిక్కుకుపోయింది.

Vanadurgamma Temple
Vanadurgamma Temple
author img

By

Published : Oct 1, 2021, 10:38 AM IST

మెదక్​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి ఆలయం పదిరోజులుగా జలదిగ్బంధలో ఉంది (edupayala Vanadurgamma Temple) . సింగూరు ప్రాజెక్టు (signor project) నుంచి దిగువకు భారీగా వరదనీరు విడుదల చేయడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగూరు నుంచి 75వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో ఏడుపాయల వద్ద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు నుంచి 58 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు నీటి పారుదలశాఖ డీఈ శివనాగరాజు వెల్లడించారు.

జలదిగ్బంధంలో కొనసాగుతున్న వనదుర్గమ్మ ఆలయం

పది రోజులుగా వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలోనే చిక్కుకోవడం వల్ల(Vanadurgamma Temple submerged in flood).. అమ్మవారి దర్శనానికొస్తున్న భక్తులు కొన్ని రోజులుగా రాజగోపురంలోని ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అమ్మవారి రాజగోపురం, వనదుర్గ ప్రాజెక్టు వద్ద ఔట్ పోస్ట్ పోలీసు సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: ఏడుపాయల దుర్గాభవాని కోవెల వద్ద వరద ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.