మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయాన్ని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్లు.. అధికారులు ప్రకటించారు. ఆలయ ఈవోకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం మహాశివరాత్రి జాతరలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులను.. ఇప్పుడీ ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఆలయంలో పని చేస్తున్న మిగిలిన సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జాతరలో పాల్గొన్న భక్తుల్లో.. మహమ్మారి లక్షణాలు కలిగిన వారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు.
ఇదీ చదవండి: రెండో ప్రాధాన్యతలో తీన్మార్ మల్లన్నకు 94 ఓట్లు జమ