ETV Bharat / state

మూఢ నమ్మకంతో  చెట్టుకు పూజలు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కరోనా వ్యాధి నివారణ పేరిట కొందరు మహిళలు వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. గ్రామస్తుల్లో కొందరు పుట్టించిన వదంతుల నేపథ్యంలో స్త్రీలు ఇలా వేప చెట్టుకు నీళ్లు పోసి పూజిస్తున్నారు.

మూఢ నమ్మకాలను ప్రచారం చేయెుద్దు
మూఢ నమ్మకాలను ప్రచారం చేయెుద్దు
author img

By

Published : Mar 24, 2020, 2:30 PM IST

కరోనా వ్యాధి నివారణకు ఓ వైపు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మరోవైపు కొందరు మూఢ నమ్మకాలతో వదంతులను సృష్టిస్తున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజక వర్గంలోని పలు గ్రామాల మహిళలు వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు. ఒక్క కొడుకు కలిగినవారు, ఇద్దరు కొడుకులు ఉన్న ఐదుగురు ఇళ్లకు వెళ్లి ఐదు చెంబుల నీటిని అడక్కుని వేపచేట్టుకు పోయాలని పుకార్లు పుట్టిస్తున్నారు.

అనంతరం ప్రత్యేక పూజలు చేయాలని చెబుతున్నారు. మహిళలందరూ ఇదే అనుసరిస్తున్నారు. ఇవన్నీ వట్టి వదంతులేనని...వాటిని నమ్మాల్సిందేమీ లేదని ఎంత చెప్పినా వినట్లేదు. కొందరు గ్రామస్తులు పని కట్టుకుని పుకార్లు పుట్టించడం వల్లే ఇలాంటి పూజలు చేస్తున్నట్లు సమాచారం.

మూఢ నమ్మకాలను ప్రచారం చేయెుద్దు

ఇవీ చూడండి : మహమ్మారులు... మానవాళికి సవాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.