ETV Bharat / state

మెదక్ జిల్లాలో మూడోవిడత రేషన్​ పంపిణీ - 12 kg of rice and kandi each One Distribution

పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. మెదక్​ జిల్లాలో మూడో విడతలో భాగంగా 12 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పును డీలర్లు ప్రజలకు అందజేస్తున్నారు. ఈసారి నగదు మాత్రం ఇవ్వడం లేదు.

Distribution of Third Ration in Medak District
మెదక్ జిల్లాలో మూడోవిడత రేషన్​ పంపిణీ
author img

By

Published : Jun 14, 2020, 2:37 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రభుత్వం లాక్​డౌన్ విధించడం వల్ల మెదక్​ జిల్లాలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా కార్డు దారులతో పాటు కుటుంబసభ్యుల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం కుటుంబానికి రూ. 1500లు కూడా అందజేశారు.

ఈసారి నగదు పంపిణీ బందు

మూడో విడత కూడా 12 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పును డీలర్లు ప్రజలకు అందజేస్తున్నారు. ఈసారి నగదు మాత్రం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక కిలో కందిపప్పు ఇవ్వగా.. ఈ నెలలో రెండు కిలోలు ఇస్తున్నారు.

బియ్యం, కందిపప్పు పంపిణీ

మెదక్ జిల్లాలోని 20 మండలాలకుగాను 521 రేషన్ దుకాణాలు ఉండగా..213,559 రేషన్​కార్డుదారుల ద్వారా..7.24. లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం, కందిపప్పు పంపిణీ జరుగుతోంది. ఆహారభద్రత కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోల చొప్పున ఇస్తున్నారు.

ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.