ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరింది. మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక గుల్షన్ క్లబ్ ఎదుట కార్మికులు దీక్ష చేపట్టారు. కార్మికులకు టీపీటీఎఫ్ జిల్లా కమిటీ, మెదక్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 10 కిలోల చొప్పున బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని జిల్లా సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సిటిజన్ ఫోరం నాయకులు, టీపీటీఎఫ్ నాయకులు, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'గురునానక్ కలల సాకారం కోసం ప్రజలు ఏకమవ్వాలి'