మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన భార్యభర్తలకు గత మూడు రోజుల క్రితం లక్షణాలు కనిపించడం వల్ల వారి నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపగా.. వచ్చిన నివేదికలో వైరస్ పాజిటివ్ అని తేలింది. దీనితో అప్రమత్తమైన జిల్లా వైద్య అధికారులు బాధితులు ఉండే పరిసరాలను సందర్శించారు. ప్రజలెవరు బయటకు వెళ్లొద్దని సూచించారు.
ఇప్పటివరకు జిల్లాలో ముప్పై కేసులు నమోదు అయ్యాయని వైద్య అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దౌలతాబాద్‌లో ఒక కరోనా కేసు నమోదు అయ్యిందని.. ముందు జాగ్రత్తగా ఆ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో సీఎస్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతు