ETV Bharat / state

శంకరంపేటలో మద్దతు ధర కల్పించాలంటూ రైతుల సంతకాల సేకరణ - medak district latest news

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు చేపట్టారు. రూ.2500 గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. రైతుల విజ్ఞప్తులను నెరవేర్చకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

congress leaders protest with farmers at chinna shankarampet in medak district
శంకరంపేటలో మద్దతు ధర కల్పించాలంటూ రైతుల సంతకాల సేకరణ
author img

By

Published : Nov 8, 2020, 1:24 PM IST

సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం రూ.2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పిలుపుతో నాయకులు సన్న రకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులను సన్న రకం వరి పంట వేయాలని చెప్పి... ఆయన వేరే ధాన్యాన్ని పండించడం ఎంతవరకు సమంజసం అంటూ రైతులు సీఎం కేసీఆర్​ని ప్రశ్నించారు. ఈ నెల 10 వరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'కేంద్రం నిధులతోనే...'

మెదక్ - చేగుంట రహదారిపై ఆందోళనకు దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోనే రైతు వేదికలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజలను బురిడీ కొట్టిస్తోందని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆరోపించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధంగా ఉన్నామని మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, రైతులు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, పార్లమెంట్ మెదక్ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్, జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, పోతరాజు రమణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పత్తి రైతులకు షాక్.. మద్దతు ధర రూ.50 తగ్గింపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.