మెదక్ జిల్లా కలెక్టరేట్లో జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్పర్సన్ ర్యాకల హేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ ప్రజలు ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికి గుర్తుంచుకుంటారని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక రాష్ట్రానికి నాంది..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికారన్నారు. దేశానికి ప్రణబ్ చేసిన సేవలు మరువలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదుగి రాష్ట్రపతి అయ్యారన్నారు. ఆయన సేవలకు ప్రతిఫలంగా భారతరత్న అందుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
అందరితో కలుపుగోలుగా..
ప్రణబ్ ప్రజాజీవితంలో అందరితో కలుపుగోలుగా ఉండేవారని మెదక్ ఇంఛార్జీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి విషయంలో పట్టు సాధించి అన్ని విషయాల్లోనూ తనదైన శైలిలో పని చేశారని కితాబిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రాగౌడ్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా 20న చలో దిల్లీ