రైతులను మోసం చేస్తే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఆటోనగర్లో వీరభద్ర, కేదారీశ్వరి ట్రేడింగ్ కంపెనీ ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ-పాస్ మిషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని.. అసలు దానిని వినియోగిస్తున్నారా? లేదా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ-పాస్ మిషన్లను ఉపయోగించకపోతే ఎరువుల దుకాణాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వాటి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దుకాణాల్లో ఉన్న లెడ్జర్ పుస్తకాలను కలెక్టర్ పరిశీలించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల నిల్వ, అమ్మకాలకు సంబంధించిన అకౌంట్లను పరిశీలించారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!