ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నాలుగున్నర నుంచే ప్రార్థనలు చేస్తున్నారు. చర్చి పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ప్రార్థనల్లో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు రైట్ రెవరెండ్ ఎసీ బిషప్ సాల్మన్ రాజు దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఏసుక్రీస్తు మానవ సంక్షేమాన్ని, లోకకల్యాణం కోరేవాడని, ఆయన జననం, ఆయన మరణం, రెండో సారి రాక , ఇది రక్షణ సువార్త అని బిషప్ సాల్మన్ రాజు అన్నారు. ఏసుప్రభువు లోక రక్షకుడిగా ఉంటారన్నారు. బాధల్లో ఉన్న వారికి ధైర్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మెదక్ చర్చికి రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివస్తారు. మెదక్ ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. వేకువజాము నుంచే ప్రార్థనలు