మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బిషప్ రైట్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకు ప్రాత కాల ప్రార్థనతో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
వేడుకల్లో మంత్రి, ఎమ్మెల్యే
తొలి ప్రార్థనకు బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజు భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి తొలి ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: 'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'