దివ్య దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వారోత్సవాలు మెదక్లో నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం పిల్లలపై వేధింపుల నివారణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. నేటి సమాజంలో బాలలపై లైంగిక వేధింపులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మెదక్ టౌన్ సీఐ వెంకట్ తెలిపారు.
పిల్లలు ఉన్నతమైన కలలు కనాలని.. వాటిని సాకారాం చేసుకునే దిశగా కృషి చేయాలని జిల్లా క్రైమ్ రిపోర్ట్ బ్యూరో సీఐ చందర్ పేర్కొన్నారు. ఏమాత్రం అధైర్య పడకుండా సమస్యలను ఎదురుకోవాలన్నారు. తమకు సంవత్సర కాలంలో ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తాయని.. ఇందులో ముఖ్యంగా బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, అక్రమ దత్తత వంటివి అధికమని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ తెలిపారు. ఫిర్యాదులు మెదక్ జిల్లాలో అధికమని వీటిని చేధించడానికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించినా, లైంగిక వేధింపులకు గురి చేసినా.. 1098 కాల్ చేయాలని చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ అశోక్ సూచించారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్