ETV Bharat / state

'కులాంతర వివాహం చేసుకున్నందుకు కుల బహిష్కరణ చేశారు' - Caste boycotted for inter-caste marriage in medak news

కులాంతర వివాహం చేసుకున్నందుకు తమను కులబహిష్కరణ చేశారని ఓ కుటుంబం ఆరోపించింది. తమకు ఎవరు సహాయం చేయకుండా.. కుల పెద్దమనుషులు తీర్పులు చెప్పారని ఆవేదన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం అధికారుల వరకు చేరటంతో వారు ఇరు కులస్థులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

Caste boycotted for inter-caste marriage  in medak district
'కులాంతర వివాహం చేసుకున్నందుకు కుల బహిష్కరణ చేశారు'
author img

By

Published : Jan 21, 2021, 12:19 PM IST

తన కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని ఓ వ్యక్తి ఆరోపించటంతో అధికారులు విచారణ చేపట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్​పల్లి గ్రామానికి చెందిన చిందం రాములు గత 30 ఏళ్ల క్రితం ముదిరాజ్ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇటీవల ఇతని కుమారుడు వేణు కూడా ఇతని మేనమామ ముదిరాజ్ కులస్థుడైన శంకరయ్య కూతురు మమతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆగ్రహించిన ముదిరాజ్ కులస్థులు తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని రాములు ఆరోపించాడు.

"మమ్మల్ని కుర్మ కులంలో ఉండవద్దని.. ముదిరాజ్ కులంలో కలవాలని కుల సంఘం పెద్ద మనుషులు ఆదేశించారు. పెళ్లి పెట్టుకుని వంటలు కూడా తయారు చేసిన తరువాత ముదిరాజ్ కులస్థులు ఎవ్వరు నా కొడకు పెళ్ళికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. మా చావు బతుకులకు, పెళ్లిళ్లకు ఎలాంటి సహాయ సహకారాలు కుర్మ కులస్థులు చేయవద్దన్నారు. మాతో మాట్లాడితే జరిమానా విధిస్తామంటూ పెద్ద మనుషులు తీర్పులు చెబుతున్నారు".

--రాములు. బాధితుడు

ఈ విషయం తెలిసిన అధికారులు బహిష్కరణ ఆరోపణలపై విచారణ చేపట్టారు. కుల పెద్దలు ఎవరు కూడా కుల బహిష్కరణ అనే పదాన్ని వాడలేదని.. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ చేశామని తహసీల్దార్ అన్నారు. తహసీల్దార్, ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్​లు ఇరు కులాల వారితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చూడండి: సూసైడ్​​ నోట్​ రాసి.. కానిస్టేబుల్ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.