ప్రాదేశిక ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుని మెదక్ జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకుంది. మెుత్తం 189 ఎంపీటీసీ స్థానాలకు తెరాస 117 సీట్లను కైవసం చేసుకుంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ 43 స్థానాలతోనే సరిపెట్టుకుంది.
భాజపా ,తెదేపా, తెజస ఖాతా తెరవలేదు. వామపక్షాలు 30 సాధించగా... ఇతరులు 28 స్థానాలతో విజయదుందుభి మోగించారు. 20 జడ్పీటీసీ స్థానాలకు తెరాస 18 గెలుచుకోగా, కాంగ్రెస్ రెండు స్థానాలను సాధించింది. మిగతా పార్టీలేవి ఖాతా తెరవకుండానే చేతులెత్తేశాయి.
ఇవీ చూడండి : కోలాహలంగా సిద్దిపేట తెరాస కార్యాలయం
# | తెరాస | కాంగ్రెస్ | వామపక్షాలు | ఇతరులు | మొత్తం |
జడ్పీటీసీ | 18 | 2 | 0 | 0 | 20 |
ఎంపీటీసీ | 117 | 43 | 30 | 28 | 189 |
మండలాల వారిగా ఎంపీటీసీ వివరాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
అల్లాదుర్గ్ | 6 | 3 | 0 | 0 | 9 |
చేగుంట | 4 | 0 | 0 | 9 | 13 |
చిలిప్చెడ్ | 3 | 0 | 0 | 2 | 5 |
హవేలి ఘన్పూర్ | 11 | 0 | 0 | 1 | 12 |
కౌడిపల్లి | 9 | 1 | 0 | 0 | 10 |
కుల్చారం | 7 | 0 | 0 | 3 | 10 |
మనోహరాబాద్ | 5 | 0 | 0 | 2 | 7 |
మెదక్ | 5 | 2 | 0 | 0 | 7 |
నర్సాపూర్ | 6 | 4 | 0 | 0 | 10 |
నార్సింగి | 2 | 1 | 0 | 2 | 5 |
నిజాంపేట | 6 | 1 | 0 | 1 | 8 |
పాపన్నపేట | 13 | 2 | 0 | 0 | 15 |
రామాయంపేట | 6 | 1 | 0 | 0 | 7 |
రేగోడ్ | 3 | 4 | 0 | 0 | 7 |
శంకరంపేట-ఎ | 9 | 3 | 0 | 0 | 12 |
శంకరంపేట(రా) | 4 | 7 | 0 | 1 | 12 |
శివ్వంపేట | 9 | 0 | 0 | 3 | 12 |
టేక్మల్ | 3 | 7 | 0 | 0 | 10 |
తూప్రాన్ | 1 | 2 | 0 | 2 | 5 |
యెల్దుర్తి | 5 | 5 | 0 | 3 | 13 |