ETV Bharat / state

అవస్థల ప్రయాణం... నత్తనడకన వంతెన నిర్మాణం! - మెదక్​జిల్లా తాజావార్తలు

ప్రమాదాలను నివారించేందుకు చేపడుతున్న వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మెదక్‌ జిల్లా పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా మారిన నాగులపల్లి కూడలిలో వంతెన నిర్మాణానికిగాను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఏడాదిన్నరలోపు పనులు పూర్తి చేయాలని నిర్దేశించినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు.

నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణం పనులు
నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణం పనులు
author img

By

Published : Aug 5, 2020, 10:58 AM IST

పనుల్లో జాప్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. మెదక్​జిల్లా పరిధిలోని 44వ జాతీయ రహదారిలోని నాగులాపల్లి కూడలిలో నిర్మిస్తున్న వంతెన పనుల్లో ఆలస్యం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. దీని నిర్మాణానికి ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32.25 కోట్లు మంజూరు చేయించారు. దీంతో మూడేళ్ల క్రితం నాగులపల్లి కూడలి వద్ద వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ నేటికీ నిర్మాణం కొలిక్కిరాలేదు.

ఈ కూడలి మీదుగా వెల్దుర్తి, మెదక్‌, నర్సాపూర్‌ వైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధానంగా వెల్దుర్తి మండలానికి చెందిన అన్ని గ్రామాల ప్రజలు వివిధ పనుల కోసం ద్విచక్రవాహనాలు, ఆటోల్లో తూప్రాన్‌కు వస్తుంటారు. మలుపు వద్ద ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.

మచ్చుకు కొన్ని

శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ శిశువుకు వైద్యం చేయించేందుకు ద్విచక్రవాహనంపై తూప్రాన్‌ వస్తున్నారు. ఇస్లాంపూర్‌ సమీపంలోని మూలమలుపు వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా వెనుక నుంచి వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శిశువు చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అదే గ్రామానికి చెందిన దంపతులు మే 28వ తేదీన ద్విచక్రవాహనంపై తూప్రాన్‌కు బయలుదేరారు. శుభకార్యం ఉండడంతో భార్యకు గాజులు వేయించేందుకు వస్తుండగా ఇస్లాంపూర్‌ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

ప్రత్యామ్నాయం లేక..

నాగులపల్లి కూడలి వద్ద పనులు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ రహదారి లేకపోవడంతో స్టేషన్‌ మాసాయిపేట వైపు ఇస్లాంపూర్‌ గ్రామశివారులో యూటర్న్‌ తీసుకొని తూప్రాన్‌కు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో హైదరాబాద్‌, నిజామాబాద్‌ వైపు వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ మూలమలుపు వద్ద ప్రమాదాలు జరురగుతున్నాయి. దీంతో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పలుమార్లు అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పనులు నత్తనడకన సాగి... ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్‌స్పాట్‌లపై దృష్టి సారిస్తే మేలు

కొన్ని నెలల కిందట జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు, మెదక్‌ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్‌) గుర్తించారు. మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంట, రామాయంపేట వరకు సుమారు పది చోట్ల ప్రమాదాల నివారణకు పలు చర్యలు చేపట్టారు. రహదారిపై రేడియం స్టిక్కర్లతో కూడి డ్రమ్ములు ఏర్పాటు చేయించారు. భారీ వాహనాలు వాటిని ఢీకొట్టడంతో కొన్నిచోట్ల అవి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బ్లాక్‌స్పాట్‌ల వద్ద అధికారులు మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాధ్యులపై చర్యలు..

ప్రమాదాలను నియంత్రించాలనే ఉద్దేశంతో నాగులపల్లి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకొనేలా చేస్తాను. పనుల్లో వేగం పెంచి వంతెన అందుబాటులోకి వచ్చేలా చొరవ తీసుకుంటాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ప్రయాణం సాగించాలి.- కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ

నవంబరులోపు పూర్తి చేస్తాం..

నాగులపల్లి కూడలి వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణాన్ని నవంబరులోగా పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాం. ప్రమాదాలు జరగకుండా చూస్తాం. బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకుంటాం.

- రాజేంద్రప్రసాద్‌, ప్రాజెక్టు మేనేజర్‌

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.