దేశంలో అనేక ప్రజాప్రయోజన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీది అని మెదక్ జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహిళ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు బెండె వీణ.. మాచవరం గ్రామంలో 70 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని, విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలుపురు భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు