మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనుచిత పదజాలంతో ఎంపీని దూషించడం తగదని భాజపా మండల అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. మెదక్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్.. రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బహిరంగ చర్చకు రమ్మని పిలిచి.. పోలీసులతో అరెస్టు చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెరాస ప్రతి అడుగును ప్రజలు గమనిస్తున్నారని, దుబ్బాక ఉప ఎన్నికలో తప్పకుండా తగిన పాఠం చెబుతారన్న జనార్ధన్.. ఈ ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
![BJP leaders arrested in medak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-srd-41-24-bjp-aruest-avb-ts10115_24102020135440_2410f_1603527880_2.jpg)
- ఇదీ చదవండి : ప్రతిపక్షాల ఎత్తులను హరీశ్ రావు చిత్తు చేయగలడా..?