అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రమైన స్థాయిలో పంట నష్టం జరిగిందని భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదికను రూపొందించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని భాజపా కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, సుధాకర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండ వీణ, గిరిజన మోర్చా అధ్యక్షురాలు ప్రియ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు దత్తుప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి: భట్టి