దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. దీనితో మెదక్ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ విజయం తెరాస ప్రభుత్వానికి, కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిదని.. జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. అధికార దుర్వినియోగం చేసి.. డబ్బు మద్యం పంపిణీ చేసినప్పిటికీ... దుబ్బాక ప్రజలు తెరాసను తిప్పికొట్టారని వెల్లడించారు.
ఈ గెలుపు దేశానికి ఘన విజయమని పేర్కొన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, 2023 ఎన్నికల్లో భాజపాకు ఈ ఫలితం నాంది కానుందని వివరించారు. ఇకనైనా తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచి... పటాకులు కాల్చారు.
- ఇదీ చదవండి: విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు