ETV Bharat / state

ఆలోచన అదిరింది... పక్షుల దాహం తీరింది.. - narsapur

వేసవిలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఏసీ సౌకర్యం ఉన్న మనుషులే అల్లాడిపోతుంటే ఇక పక్షుల పరిస్థితి చెప్పనక్కరలేదు. వాగులన్నీ ఎండిపోయి.. చెరువులన్నీ ఇంకిపోయి.. బావులన్నీ ఆరిపోయి.. మబ్బులు ముఖం చాటేసి ఎటు చూసినా నీటిజాడ కనుమరుగైంది. పక్షులకు చుక్క నీరు దొరకని దుస్థితి. ఈ పరిస్థితిని చూసి కొందరు యువకులు ఒక బృందంగా ఏర్పడి పక్షుల కోసం నీరు, ఆహారం అందిస్తున్నారు. ఆ విశేషాలేమిటో చూద్దాం..

ఆలోచన అదిరింది... పక్షుల దాహం తీరింది..
author img

By

Published : Apr 15, 2019, 5:01 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న చెట్టు కొమ్మలకు రంగురంగుల తొట్టెలు వేలాడుతూ కనిపిస్తాయి. అవేవో అలంకరణకోసం అనుకుంటే పొరపాటే. పక్షుల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు.

బాధ్యతగా ముందుకొచ్చి

ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన స్వచ్ఛభారత్​ సభ్యులు. వేసవిలో పక్షులు పడుతున్న బాధలను చూసి ఏదైనా చేయాలనుకున్నారు. దాతల సహకారంతో రహదారి వెంబడి రెండు కిలోమీటర్ల మేర నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు.

రోజు మార్చి రోజు బృంద సభ్యులు వంతుల వారీగా తొట్టెల్లో నీరు, ఆహారం నింపి వెళ్తారు. రెండేళ్లుగా చేస్తున్న ఈ కార్యక్రమం తమకెంతో సంతోషాన్నిస్తుందంటున్నారు ఈసంస్థ సభ్యులు.

వీరు చేస్తున్న సేవకు పలువురు బాసటగా నిలుస్తున్నారు. వాహన చోదకులు ఆగి మరీ వీటిని పరిశీలించి వెళ్తున్నారు. మూగ జీవుల కోసం వీరు చేస్తున్న పని అభినందనీయం.

ఆలోచన అదిరేట్టు... పక్షుల దాహం తీరేట్టు..

ఇదీ చదవండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.