ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టణంతోపాటు సర్కిల్ పరిధిలో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల బ్రహ్మం, వడ్ల వెంకటేశ్వర్లు దొంగతనాలకు పాల్పడుతూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ద్విచక్ర వాహనాల దొంగలను పకడ్బందీ ప్రణాళికతో నర్సాపూర్ పోలీసులు పట్టుకున్నారు.
పగలు
చూసొస్తారు.. రాత్రికి మాయం చేస్తారు
గత కొంతకాలంగా ఇళ్లముందు నిలిపి ఉంచిన వాహనాలే లక్ష్యంగా పగలు చూసి రాత్రి వేళల్లో చోరీలు చేస్తున్నారు. వీరు పాత నేర స్తులు కావడం వల్ల ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు నర్సాపూర్ సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.