ETV Bharat / state

ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి: పద్మ - మెదక్ జిల్లా తాజా వార్తలు

తెలంగాణకి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ప్రతి ఆడపడుచు ఘనంగా జరుపుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చిన్న శంకరంపేట మండలంలో ఆమె బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

bathukamma-cheerala-pampini in chinasankarampeta medak district by mla padmadevender reddy
ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలి: పద్మ
author img

By

Published : Sep 28, 2020, 1:46 PM IST

ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఈ పండుగ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లిలో మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చీరలను అందిస్తోందని పద్మ అన్నారు.​

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో చీరల పంపిణీ జరుగుతోందని డీఆర్​డీఏ పీడీ శ్రీనివాస్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట జడ్పీటీసీ మాధవి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శ్రీశైలానికి వరద ప్రవాహం... 10 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.