ETV Bharat / state

మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు - బతుకమ్మ 2020 వార్తలు

మెదక్​ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే బతుకమ్మల అలంకరణలో నిమగ్నమైన మహిళలు.. సాయంత్రం సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు.

bathukamma celebrations in medak district
మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 24, 2020, 8:41 PM IST

రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సద్దుల బతుకమ్మను మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి.. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

సాయంత్రం సంప్రదాయ దుస్తులు ధరించి పట్టణంలోని కోదండ రామాలయం, బాలాజీ మఠం, ఫతేనగర్, వాసవి నగర్ తదితర కాలనీల్లో మహిళలంతా బతుకమ్మలను ఒకచోట చేర్చి ఉల్లాసంగా ఆడిపాడారు. అనంతరం స్థానికంగా ఉన్న చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేసి.. వయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఇదీ చూడండి: 'కేసీఆర్​ నియంతృత్వ పోకడలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.