ETV Bharat / state

Praja Sangrama Yatra: అధైర్యమొద్దు.. అండగా ఉంటా.. రైతులకు సంజయ్ భరోసా

బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర మెదక్​ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా చిట్కూల్​లోని చాముండేశ్వరీ ఆలయంలో బండి సంజయ్​ ప్రత్యేక పూజలు నిర్వహించి.. యాత్రను ప్రారంభించారు. కొల్చారం మండలం ఘనపూర్ వరకు యాత్ర సాగనుంది.

PRAJA SANGRAMA YATRA: మెదక్​ జిల్లాలో ప్రారంభమైన బండి సంజయ్​ యాత్ర

author img

By

Published : Sep 12, 2021, 4:53 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మెదక్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా చండూర్​ చౌరస్తా వద్ద భాజపా నేతలు బండి సంజయ్​కు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిలప్​చెడ్ మండలం చిట్కూల్​లోని చాముండేశ్వరీ దేవాలయంలో బండి సంజయ్​ ప్రత్యేక పూజలు నిర్వహించి.. యాత్రను ప్రారంభించారు. కొల్చారం మండలం ఘనపూర్ వరకు యాత్ర సాగనుంది.

చాముండేశ్వరీ దేవాలయంలో బండి సంజయ్​ ప్రత్యేక పూజలు

యాత్రలో భాగంగా స్థానిక కుమ్మరి కులస్థులతో మాట్లాడిన బండి సంజయ్​.. వారి కష్టాలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కుమ్మరి సంఘం నేతలు తెలిపారు. అనంతరం పలువురు రైతులతో మాట్లాడిన సంజయ్​.. వారి సమస్యలపైనా ఆరా తీశారు. డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇంకా కేటాయించలేదని.. వేసిన పంట అకాల వర్షాల వల్ల నష్టపోయామని రైతులు సంజయ్​కు తెలిపారు. అండగా ఉంటానని సంజయ్​ వారికి భరోసానిచ్చారు.

BANDI SANJAY: 'సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా తెరాసతో చర్చకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.