ETV Bharat / state

గుర్తు తెలియని వృద్ధురాలి హత్య - మెదక్ జిల్లా మనోహరాబాద్‌ వార్తలు

ప్రతిరోజు ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో అత్యంత దారుణంగా వృద్ధురాలి గొంతుకోసి హత్యచేసి జాతీయ రహదారి పడవేసి వెళ్లారు దుండగులు. మహిళను ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

An Unidentified  Old women murder in  Manoharabad
గుర్తు తెలియని వృద్ధురాలి హత్య
author img

By

Published : Oct 12, 2020, 3:52 PM IST

మెదక్ జిల్లా మనోహరాబాద్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వృద్ధురాలి(60) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యంత దారుణంగా వృద్ధురాలిని గొంతుకోసి హత్యచేసి జాతీయ రహదారి వెంట వ్యవసాయ పొలం గేట్ పక్కన పడేసి వెళ్లారు కిరాతకులు.

మహిళను ఎక్కడో హత్య చేసి రహదారి పక్కన పడేసి ఉంటారని తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితుల కోసం చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హత్య కేసు నమోదు చేశామని, దర్యాప్తును వేగవంతం చేస్తామన్నారు.

ఇదీ చూడండి:సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య.. బంధువులపైనే అనుుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.