మెదక్ పట్టణంలో తారక రామానగర్ కాలనీలో ధరణి మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని మొదటి వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. మండుతున్న ఎండలను దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ధరణి మహిళల క్లబ్ మరిన్ని కార్యక్రమాలతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధరణి మహిళా సంఘం అధ్యక్షురాలు శకుంతల, ఉపాధ్యక్షురాలు శిల్ప అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులకు అవగాహన