ETV Bharat / state

ఆరో విడత హరితహారం.. సీఎం పర్యటనకు సర్వం సిద్ధం - all set for kcr tour in medak

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఆరో విడత ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్​ మెదక్​ జిల్లా నుంచి గురువారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

SIXTH PHASE OF HARITHAHARAM
ఆరో విడత హరితహారం.. సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
author img

By

Published : Jun 24, 2020, 4:49 AM IST

ఆరో విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. గురువారం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. నర్సాపూర్​లో అటవీ శాఖ అభివృద్ధి చేసిన అర్బన్ పార్కును ప్రారంభించి.. అందులో మొక్కను నాటనున్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో చేపట్టిన పునరుజ్జీవన పనులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. వాచ్ టవర్ ఎక్కి అడవుల అందాలను వీక్షించనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్​రావు.. అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పలు సూచనలు చేశారు. కరోనా ప్రభావంతో సీఎం కార్యక్రమాన్ని సాధారణంగా నిర్వహిస్తున్నట్లు హరీశ్​ తెలిపారు. ప్రజా ప్రతినిధులను సైతం పరిమితంగా అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరి ఇంటి వద్ద వారు మొక్కలు నాటి కేసీఆర్​కు సంఘీభావం తెలపాలని సూచించారు. అనంతరం సీఎం పర్యటనపై అధికారులతో హరీశ్​రావు సమీక్షించారు.

నర్సాపూర్ పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత సీఎం మొదటిసారి పట్టణానికి వస్తుండటంతో.. పాలకవర్గం ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతోంది.

ఇవీచూడండి: ఔషధ మొక్కలపై పరిశోధనకు ఇదే సరైన సమయం: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.