తొలిరోజు మూడు నామపత్రాలు దాఖలు - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామపత్రాల స్వీకరణ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామపత్రాలు స్వీకరణ ప్రారంభమైంది. మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఇవాళ మూడు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
![తొలిరోజు మూడు నామపత్రాలు దాఖలు PACS_NAMINATIO](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5981861-thumbnail-3x2-mdk-rk.jpg?imwidth=3840)
తొలిరోజు మూడు నామపత్రాలు దాఖలు
మెదక్ జిల్లాలోని 20 మండలాల్లోని 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 1,2,9 వార్డులకు మూడు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి రాంబాబు తెలిపారు.
సహకార ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రాథమిక సహకార సంఘాల వద్ద అభ్యర్థుల సందడి నెలకొంది.. నేటి నుంచి 8వ తేదీ వరకు నామపత్రాల స్వీకరణ.... తొమ్మిదిన పరిశీలన ఉంటుంది. పదో తేదీ వరకు నామ పత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. ఈనెల 15న పోలింగ్ జరుగుతుంది.
తొలిరోజు మూడు నామపత్రాలు దాఖలు