ఏడుపాయల వనదుర్గా భవానిమాత ఆలయాన్ని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి. రమేశ్ సందర్శించారు. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమేశ్ జిల్లా ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.
అంతకు ముందు మెదక్ చర్చిని సందర్శించిన అదనపు కలెక్టర్ జి. రమేశ్ ఏసు చరిత్రను, చర్చి ఔన్నత్యాన్ని గురించి పాస్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద చర్చిగా నిలవడం దేశానికే గర్వకారణమని అన్నారు.
ఇదీ చదవండి: నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత?