ACB Raids on MPDO: మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్ రెడ్డి కార్యాలయంలో అనిశా దాడులు ముగిశాయి. మనోహరాబాద్ ఎంపీడీవో జైపాల్‌రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంతో పాటు మేడ్చల్‌లోని ఆయన నివాసంలో మంగళవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. జైపాల్ రెడ్డి ఇంట్లో రూ.25 లక్షల నగదును అనిశా అధికారులు గుర్తించారు. ఆయన పేరిట ఉన్న రూ.66 లక్షల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అనిశా అధికారులు వెల్లడించారు. ఎంపీడీవోకి చెందిన 3 లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఉదయం నుంచి కొనసాగిన దాడులు
manoharabad MPDO office: మెదక్ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం, ఇంట్లో దస్తావేజులతో పాటు ఆయన ఆస్తులపై ఆరా తీశారు. జైపాల్ రెడ్డి ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అది డిసెంబర్ 31 వరకు పూర్తి కాగా జిల్లా కలెక్టర్ ఆమోదం ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది.
- ఇవీ చూడండి:
- ACB caught Sub registrar: రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సబ్ రిజిస్ట్రార్
- Bribe: అనిశా వలలో భూకొలతలశాఖ ఏడీ, జూనియర్ సహాయకుడు
- కలెక్టరేట్లో అనిశా సోదాలు... లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు
- అనిశా వలలో మరో అవినితి తిమింగలం.. రోజుకు లక్ష లక్ష్యంతో లంచాల మేత..!
- Acb Raids: అనిశా వలలో అవినీతి ఎస్సై... ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులోనే...