మెదక్ పూర్వ అదనపు కలెక్టర్ నగేశ్ లంచం కేసులో అనిశా విచారణ చేపట్టింది. నగేశ్ అవినీతి వ్యవహారాలపై క్షేత్ర స్థాయిలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో రైతులతో మాట్లాడిన అధికారులు... గ్రామంలో జరిగిన భూముల లావాదేవీల విషయమై ఆరా తీశారు.
ఇదీ జరిగింది..
రూ. కోటి 12 లక్షల అవినీతి వ్యవహారంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ అనిశా అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. 112 ఎకరాల భూమికి సంబంధించిన నిరభ్యంతర పత్రం-ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. 40 లక్షలు తీసుకొని ఐదు ఎకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేలా ఒప్పందం రాయించుకోవడం అనిశా అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో పాటు నర్సాపూర్ ఆర్డీవో బి.అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ అబ్ధుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్ గౌడ్‌ను గతంలో అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: అదనపు కలెక్టర్ నగేశ్.. ఖైదీ నంబర్ 9444