ETV Bharat / state

అనిశాకు చిక్కిన మరో తిమింగలం.. కోటి 12 లక్షల అవినీతి

author img

By

Published : Sep 10, 2020, 6:20 AM IST

భూదందాలు, అవినీతికి చెక్‌పెట్టేలా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తెస్తుండగానే కొందరు ఉన్నతాధికారుల అక్రమాలు బయటపడటం కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా కీసర తహశీల్దార్‌ కోటి రూపాయలకుపైగా లంచం కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. భూమికి సంబంధించిన ఎన్వోసీ జారీకి మెదక్‌ అదనపు కలెక్టర్‌ రూ. కోటికి పైగా డిమాండ్‌ చేసి ఏసీబీకి చిక్కాడు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

అనిశాకు చిక్కిన మరో తిమింగలం.. కోటి 12 లక్షల అవినీతి
అనిశాకు చిక్కిన మరో తిమింగలం.. కోటి 12 లక్షల అవినీతి
acb-caught-one-more-bribe-accuest-in-medak-district

అవినీతి నిరోధకశాఖ అధికారులకు అతిపెద్ద తిమింగలం చిక్కింది. రూ. కోటి 12 లక్షల అవినీతి వ్యవహారంలో మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ బుధవారం దొరికిపోయారు. 112 ఎకరాల భూమికి సంబంధించిన నిరభ్యంతర పత్రం-ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. 40 లక్షలు తీసుకొని ఐదు ఎకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేలా ఒప్పందం రాయించుకోవడం అనిశా అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో అడిషనల్‌ కలెక్టర్‌ నగేషశ్​తో పాటు నర్సాపూర్‌ ఆర్డీవో బి.అరుణారెడ్డి, చిలప్‌చెడ్‌ తహసీల్దార్​ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం అహ్మద్‌, బినామీ జీవన్‌గౌడ్‌ను అధికారులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తితో పాటు మరో నలుగురు కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని చిప్పల్‌తుర్తిలో.. 112 ఎకరాలు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిషేధిత జాబితాలోని ఆభూముల రిజిస్ట్రేషన్‌కు వీలుగా ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎకరాకు లక్ష చొప్పున మొత్తం రూ. కోటి 12 లక్షలు లంచంగా ఇవ్వాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్​ డిమాండ్‌ చేయడం వల్ల బాధితుడు లింగమూర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రూ. 40 లక్షలు నగదు తీసుకున్న అదనపు కలెక్టర్.. మరో 72 లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని బినామీ అయిన జీవన్‌గౌడ్ పేరు మీద ఒప్పందం చేయించుకున్నాడు. ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు గ్యారంటీగా వారి నుంచి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నారు. నగేశ్​, సూచనల మేరకు బాధితుల నుంచి ఐదు లక్షలు తీసుకున్న జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం అహ్మద్‌ అందులో నుంచి ఒక్కో లక్ష చొప్పున ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చెడ్‌ తహసీల్దార్​ అబ్దుల్‌ సత్తార్‌లకు అందించారు. అధికారులు మాట్లాడిన సంభాషణలు సహా ఇతర ఆధారాలు బాధితుడు అనిశా అధికారులకు అందించాడు.

మెదక్‌ జిల్లా క్యాంపు కార్యాలయం, అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్​ నివాసం సహా.. ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చెడ్‌ తహసీల్దార్​ అబ్దుల్‌ సత్తార్‌లనూ అనిశా విచారించింది. వారి నగదు, ఖాళీ చెక్కులు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. శాసనసభలో ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన రోజే మెదక్‌ జిల్లాలో ఇలా ఉన్నతాధికారులపై దాడులు జరగడం గమనార్హం.

వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని చిప్పల్‌తుర్తిలోని 112 ఎకరాల భూమిలో రిజిస్ట్రేషన్లు జరగకుండా 2008 నుంచి నిషేధిత జాబితాలో పెట్టారు. అయితే ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఆగస్టు 26న రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల అమలు చేయలేదని రిజిస్ట్రార్‌ రమేశ్​ రెడ్డి తెలిపారు. జులై 31న మెదక్ కలెక్టర్‌ పేరిట వచ్చిన లేఖతో 112 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఈ లేఖ మెదక్‌ కలెక్టరేట్‌ నుంచి వెళ్లిందా లేదా అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్​ ఇలా పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం వెల్కటూరుకు చెందిన గడ్డంనగేశ్​ మెదక్‌ జిల్లాకు రావడానికి ముందు కామారెడ్డి, నిర్మల్‌లో ఆర్డీవోగా పనిచేశారు. 2018లో మెదక్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతంలోనూ అతనిపై అవినీతి ఆరోపణలున్నాయి. నిర్మల్‌లో పనిచేస్తున్నప్పుడే నగేశ్​కు జీవన్‌రెడ్డితో పరిచయమైంది. వివాదాస్పద భూముల పరిష్కారానికి సహకరించడంతో వారి మధ్య నమ్మకం ఏర్పడింది. నిందితులను గురువారం అనిశా న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. అనంతరం ఏసీబీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.