మెదక్ జిల్లా న్యాయస్థానం ఓ మానవమృగానికి జీవితఖైదు విధించింది. శ్రీనివాస్ అనే 57సంవత్సరాల వ్యక్తి.. మూడు సంవత్సరాల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేశాడు.
నేరం రుజువు కావడంతో.. ఈ కేసును విచారించిన మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పాపిరెడ్డి.. నిందితునికి 5వేల జరిమానాతో పాటు జీవితఖైదు విధించారు. నేరస్తుడికి శిక్ష పడటంలో కృషి చేసిన వారిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.
ఇవీ చూడండి: 'న్యాయస్థానాలను ధిక్కరిస్తే మూల్యం తప్పదు'