మెదక్ జిల్లా చేగుంట మండలం పోతనపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ గ్రామ మహిళా సంఘం, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మద్యపానం వల్ల గ్రామాల్లోని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని పాలకవర్గ సభ్యులు తెలిపారు. గ్రామంలో మద్యం అమ్మితే పది వేల రూపాయల జరిమానా అని, మద్యం కొంటే ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తూ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అన్నారు.
అలాగే గ్రామంలో మద్యం అమ్మే వారిని, కొనే వారిని ఆధారాలతో పట్టించిన వారికి రెండు వేల రూపాయల నజరానా ఇవ్వబడుతుందని అన్నారు.
ఇవీ చూడండి: మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా.. తండ్రీకొడుకులకు సోకిన వైరస్