ETV Bharat / state

కిడ్నీ బాధితులపై కనికరం..! - dialysis centers working hours increase

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వైద్య సహాయం అవసరం ఉన్న రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరమైతేనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. ఈ తరుణంలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి వైద్య, ఆరోగ్య శాఖ సహాయం అందిస్తోంది.

102 vehicle service to  kidny patients
102 vehicle service to kidny patients
author img

By

Published : May 3, 2020, 11:32 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో గర్భిణులకు వైద్య సాయం అందేలా 102 వాహనాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానం చేయగా, రక్తశుద్ధి చేసుకునే రోగులకు సైతం రవాణా సౌకర్యం కల్పిస్తోంది. వారు సుదూర ప్రాంతాలనుంచి రావాల్సి ఉండడం వల్ల వారికి ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం) వాహనాల్లో ఆస్పత్రులకు చేరవేస్తున్నారు. కేవలం మెదక్​ జిల్లా పరిధికే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు సైతం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీంతో రోగులకు సాంత్వన చేకూరుతుంది.

జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు వంద మంది వరకు ఉన్నారు. వారికి రక్తశుద్ధి చేసేందుకు జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు పడకలతో ఉన్న ఈ కేంద్రంలో ప్రతిరోజూ ఐదు షిఫ్ట్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఒక షిఫ్ట్‌ను తగ్గించి నాలుగుకు పరిమితం చేశారు. ఒక రోగి మృతి చెందడంతో ఒక షిఫ్ట్‌ను తగ్గించారు. ఉదయం 6 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నాలుగు షిఫ్ట్‌ల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఐదు యంత్రాలున్న ఈ కేంద్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు ఉచితంగా రక్తశుద్ధి చేస్తున్నారు.

ఉచితంగా రవాణా సదుపాయం...

గర్భిణులకు 102 వాహనాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ కిడ్నీ బాధిత రోగులకు సైతం వాహన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఆరు వాహనాలు కేటాయించింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నాలుగు, ఇతర జిల్లాలకు తరలించేందుకు మరో రెండు వాహనాలను వినియోగిస్తున్నారు. జిల్లాలో 100 మంది కిడ్నీ వ్యాధి సంబంధిత రోగులుండగా, వారిలో 35 మంది స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తాన్ని శుద్ధి చేసుకోవడానికి వస్తున్నారు.

మిగిలిన 65 మంది హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు వెళ్తుండగా కొందరు కామారెడ్డికి వెళ్తున్నారు. పెద్దశంకరంపేట, టేక్మాల్‌, కొల్చారం, హవేలి ఘనపూర్‌, చేగుంట, వెల్దుర్తి, రామాయంపేట మండలాలకు చెందిన రోగులకు స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 65 మందిలో కొందరు పది రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉండడం వల్ల వారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు చేరవేస్తున్నారు. బాధితుడి వెంట సహాయకుడిని సైతం అనుమతిస్తున్నారు. రోగులను ఆస్పత్రికి తీసుకురావడంతో పాటు చికిత్సలు ముగిసిన తర్వాత వారిని ఇళ్ల వద్ద దింపుతుండటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.